సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సుప్రీం కోర్ట్ గతంలో ఇచ్చిన నిబంధనలు ప్రకారం అతిక్రమిస్తున్నాయని ఏపీ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో తాజగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో పోరాడాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే సోమవారంలోగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇది వైసీపీ నేతల కుట్ర అని వారే బిసి లకు స్థానిక ఎన్నికలలోబీసీ లకు పెంచిన రిజర్వేషన్స్ అడ్డుకొంటున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.ఈ అంశంపై ఇప్పటికే అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు సీనియర్ న్యాయనిపుణులతో సీఎం మాట్లాడారు. తాజా పరిణామాలు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత వెనక్కు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి.
