సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఉద్దేశించిన రెండో విడత శాంతి చర్చలపై సందిగ్ధత ఎట్టకేలకు నేటి మంగళవారం ఉదయం తొలగిపోయింది అని భావిస్తున్నారు. అయితే. డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చర్చలపై అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగనున్న ఈ కీలక చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా ప్రతినిధి బృందం ఇప్పటికే చేరుకోగా .. మోసపూరిత డిమాండ్ లు చేస్తున్న అమెరికాతో చర్చలు జరిపే ప్రణాళిక ఏదీ లేదని,ఇక చర్చలకు రాను అని మొరాయించిన ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఎట్టకేలకు నేడు, తమ విదేశాంగ శాఖ ప్రతినిధి బృందానికి అనుమతినిచ్చినట్లు? తెలుస్తోంది. దీనితో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నేటి మంగళవారం ఇస్లామాబాద్ చేరుకొంటున్నారు. ఇరు దేశాల మధ్య కుదిరిన 14 రోజుల కాల్పుల విరమణ గడువు రేపటితో అంటే ఏప్రిల్ 22తో ముగియనుంది. ఈ నేపథ్యంలో, గడువులోగా చర్చలు జరగకపోతేఇరాన్పై భారీ బాంబు దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో ప్రక్క హడావిడి చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ 2వ ధపా చర్చలు సఫలం కావాలని ప్రపంచం కోరుకొంటుంది.
