సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గత 2 రోజులుగా నష్టాలు చవిచూశాయి. నేటి బుధవారం ఉదయం కుడి నష్టాల్లో కొనసాగిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కాస్త దూసుకొని పైకి వెళ్లాయి.కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు లాభపడింది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 110 డాలర్ల దిగువకు వచ్చింది. గత సెషన్ ముగింపు (75,200)తో పోల్చుకుంటే నేడు బుధవారం ఉదయం 400 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత చివరకు సెన్సెక్స్ 117 పాయింట్ల స్వల్ప లాభంతో 75,318 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే చివరకు 41 పాయింట్ల లాభంతో 23,659 వద్ద స్థిరపడింది (stock market ).బ్యాంక్ నిఫ్టీ 153 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 301 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 96.82 కు మరింత పడిపోయింది.
