సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ డిజిటల్‌గా సంతకాలు చేశారు. అమెరికా ఇరాన్ మధ్య పూర్తీ యుద్ధ విరమణ తరువాత నేడు, గురువారం హోర్ముజ్ నుంచి చమురు సరఫరా సజావుగా సాగడానికి మార్గం సుగమం కావడంతో నేడు, గురువారం వరుసగా నాలుగో రోజు కూడా దేశీయ సూచీలు లాభాలతోనే ముగిశాయి. బ్రెంట్ క్రూడాయిల్ భారీగా తగ్గి బ్యారెల్ ధర 78.23 డాలర్లకు స్థిరపడింది.. ఈ నేపథ్యంలోగత సెషన్ ముగింపు (77,155)తో పోల్చుకుంటే నేడు గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు ఒడిదుడుకులు తరువాత చివరకు 254 పాయింట్ల లాభంతో 77,409 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా చివరకు 82 పాయింట్ల లాభంతో 24,168 వద్ద స్థిరపడింది (stock market). బ్యాంక్ నిఫ్టీ 378 పాయింట్ల లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 255 పాయింట్లు సాధించింది.
