సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నైరుతి రుతుపవనాలు వేగం మందగించి వర్షాలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో అదృష్టవశాత్తు బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం బలంగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే కొన్ని రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. .నేడు, గురువారం ఉదయం, సాయంత్రం భీమవరంలో చిరుజల్లులు పలకరించినప్పటికీ మధ్యాహ్నం భానుడు ప్రచండంగానే ఉన్నాడు.తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, కాకినాడ, గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడవచ్చు. రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *