సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం దేశ ఆటోమొబైల్ రంగంలో సాంకేతిక అభివృద్ధి, స్వదేశీ ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో హర్యానా రాష్ట్రము లోని మనేసర్‌లో భారీ పరిశ్రమల శాఖ అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ‘ICAT@20’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొని, ICAT స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ‘లోడ్ కార్’ను ఆవిష్కరించారు. కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ దేశానికి రెండు దశాబ్దాలుగా అంకితభావంతో సేవలందిస్తూ, ఆటోమోటివ్ రంగంలో నమ్మకమైన పరీక్షా, ధృవీకరణ కేంద్రంగా ఎదుగుతున్న ICAT ను ఆయన అభినందించారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ‘PM E-DRIVE’ వంటి వినూత్న పథకాలను తీసుకొచ్చి, ఎలక్ట్రిక్ మొబిలిటీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రాక్టర్ల పనితీరును ప్రతిసారీ కచ్చితంగా అంచనా వేసేందుకు వీలుగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో CAT అభివృద్ధి చేసిన ‘లోడ్ కార్’ చాలా ప్రయోజనకరమన్నారు.ప్రతి పరికరాన్ని దేశీయంగానే తయారు చేసుకుని ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *