సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 2026 సంవత్సరానికి గానూ భారీ సంఖ్యలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి సిద్ధమైంది. మొత్తం 11,127 ఖాళీల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం, దరఖాస్తు ప్రక్రియ మే 15 నుండి ప్రారంభం కానుంది. చివరి తేదీ: జూన్ 14, 2026, రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) విభాగంలో ఖాళీగా ఉన్న 11,127 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు సంబంధిత ట్రేడులలో (ఉదాహరణకు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ మొదలైనవి) ఐటిఐ (ITI) పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ చేసిన వారు కూడా అర్హులు. వయోపరిమితి:అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.మెడికల్ ఎగ్జామినేషన్: లోకో పైలట్ ఉద్యోగం కావడంతో కంటి చూపు (A-1 స్టాండర్డ్) అత్యంత ముఖ్యం.ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలో పే లెవల్-2 ప్రకారం రూ. 19,900 మూల వేతనంతో పాటు ఇతర అలవెన్సులు (DA, HRA, రన్నింగ్ అలవెన్స్) కలిపి నెలకు సుమారు రూ. 35,000 నుండి రూ. 45,000 వరకు వేతనం లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *