సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విక్టరీ వెంకటేష్ హీరోగా భీమవరం బ్రాండ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ ఏకే 47 సినిమా క్లయిమాక్స్ యాక్షన్ సన్నివేశాలను ఇటీవల హైదరాబాద్ లో భారీ స్థాయిలో పూర్తీ చేసారు. మరి కొన్ని సన్నివేశాలు మినహా షూటింగ్ దాదాపు పూర్తీ అయ్యింది. దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్త్తున్నారు. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ తదుపరి జూ. ఎన్టీఆర్ హీరోగా దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్‌లలో గాడ్ ఆఫ్ వార్ God of War ఒకటి. ఈ సినిమా దేవతల సేనాధిపతి కార్తికేయుడి నేపథ్యంతో రూపొందనున్న భారీ మైథలాజికల్ డ్రామా అని ఇప్పటికే టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి అభిమానులకు ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇవ్వాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా పోస్టర్ మాత్రమే కాకుండా, ప్రత్యేకంగా ఒక అనౌన్స్‌మెంట్ వీడియోను కూడా సిద్ధం చేస్తున్నారని సమాచారం..ప్రస్తుతం ఈ వీడియో వీఎఫ్ఎక్స్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.
