సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు, గురువారం ఉదయం విడుదలయ్యాయి. ఈసారి ముందుగా ఉహించినట్లే టెన్త్ ఫలితాల్లో ఎక్కువ శాతం మంది 85.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు వచ్చాయి కనుక.. రీకౌంటింగ్ & రీ-వెరిఫికేషన్: ఫలితాలపై అసంతృప్తి ఉన్న విద్యార్థులు మే 1 నుంచి మే 7(రాత్రి 11 గంటల) వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ.500, రీ-వెరిఫికేషన్‌కు రూ.1,000 ఫీజు చెల్లించాలి. అయితే . అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ: పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని వారి కోసం మే 25 నుంచి జూన్ 4 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. . అపరాధ రుసుము లేకుండా మే 9 వరకు, రూ.50 అపరాధ రుసుముతో మే 10 నుంచి మే 25 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. విద్యార్థుల ఫలితాలు ఫై సబ్జెక్టు వారీగా మార్కుల మెమోలు నాలుగు రోజుల్లో అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
