సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం భీమవరం పట్టణ శివారు లోని ‘రఘురామా’ కార్యాలయంలో ఉండి నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు వారికి వైద్య ఖర్చుల నిమిత్తం “ముఖ్యమంత్రి సహాయ నిధి” నుండి మంజూరైన రూ. 54,12,067/- సీఎంఆర్ఎఫ్ చెక్కులను 44 మంది లబ్ధిదారులకు రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు వారికీ అందజేశారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, పాలకోడేరు సహకార బ్యాంకు చైర్మెన్ కొత్తపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
