సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పటికి ఎన్నో సందేహాలు ఉన్న విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ నిర్వహణకు దాదాపు రూ. 8,000 కోట్లను ఈక్విటీ రూపంలో సమకూర్చాలని కేం ద్ర ఉక్కు శాఖ నిర్ణయించింది. గతంలో కూడా కేంద్ర ఉక్కు గనుల సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రోద్భలంతో కేంద్రం 11వేల కోట్ల రూపాయలు సమకూర్చిన విషయం విదితమే.. ఈసారి కూడా నష్టాల ఊబిలో కూరుకుపోయిన స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలను గాడిలో పెట్టేందుకు, కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.ఈ మేరకు,కేంద్ర మంత్రి, శ్రీనివాస్ వర్మ చొరవతో కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే ఫైల్‌ను సిద్ధం చేసి క్యాబినెట్ ఆమోదం కోసం పంపనుంది. ఈ నిర్ణయం విశాఖపట్నంలో ఉక్కు కార్మికులకు, స్థానికులకు ఎంతో ఊరటనిచ్చే పరిణామం ప్లాంట్ పునరుద్ధరణకు ఇది ఒక కీలకమైన ముందడుగుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
