సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం శ్రీ విష్ణు మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో నేడు, బుధవారం “విష్వా టెక్”2022 వార్షిక సాంకేతిక సదస్సు ను నిర్వహించారు, విద్యార్ధులు, పరిశోధకులు, విద్యావేత్తలలో మరియు సామాన్య మహిళలలో ఉపాధికి కొత్త ఆలోచనలను ప్రతిబించే నూతన ఉత్త్పతుల తయారీకి వాటిని మార్కెట్ కు ప్రచారం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతే కాకుండా పరిశోధనలకు అవసరమైన PCB (ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్) తయారీ సదుపాయం మరియు కో-వర్కింగ్ స్పేస్ లాంటి అత్యాధునిక సాధుపాయాలను వివిధ అంకుర పరిశ్రమలు ఉపయోగపడే విధంగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం.కె.కౌశిక్, CEO, VTBI, మాట్లాడుతూ.. అసిస్టయివే టెక్నాలజీ, ఉపయోగించి అంగవైకల్యం కలిగిన వ్యక్తులకు ఉపయోగపడే పరికరాలను తయారు చేస్తున్న యువ పారిశ్రామికవేత్తల కోసం, తక్కువ ధరలో వైద్య పరికరాలు తయారుచేసే వారికి, అగ్రిటెక్ ఆధారిత ఆవిష్కరణలుచేసేవారికీ, ఈ విష్వా టెక్ సహకరిస్తుందన్నారు, చైర్మన్, కె.వి.విష్ణు రాజు మాట్లాడుతూ.. పరిశ్రమలకు మరియు వ్యాపార సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు అవసరంఅని, అటువంటి ఆలోచన కృషి వరులకు సహకరిస్తామన్నారు. కార్యదర్శి ఆదిత్య విశ్వం మాట్లాడుతూ.. తాను ఇటీవల ఇజ్రాయిల్ దేశంలో పర్యటించినప్పుడు హైదరాబాద్ సిటీ జనం అంత తక్కువ మంది వుండే ఆ దేశ ప్రజలు సరికొత్త ఆలోచనలు, అపూర్వ కృషితో ఎన్నో అద్భుతాలు చేసి ప్రపంచాన్ని అబ్బురపరిచారని దానివెనుక వారి ప్యూహం గమనించానని అక్కడి తరహాలోనే మన దేశంలో కూడా స్టార్టప్ లు, విద్యార్థి ఆవిష్కర్తలకు మరియువిద్యా సంస్థలు కలిసి పనిచేయాలని అప్పుడు అద్భుతాలు జరుగుతాయని అన్నారు. విష్ణు ఎడ్యుకేషనల్ డెవలప్ మెంట్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్కు చెందిన రవిచంద్రన్ రాజగోపాల్, వైస్ చైర్మన్, భూబేష్ కుమార్, CEO, లు వేదికపై మాట్లాడారు. ఇటీవల నూతన ఆవిష్కరణలు చేసిన యువ తరం మేధావులను అభినందించారు. సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ G. శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ P. శ్రీనివాస రాజు మరియు కళాశాల అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
