సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నందమూరి బాలకృష్ణ హీరో రవితెజ కి ఫోన్ చేసి ( ఆహా షోలో తాజాగా) ఈ సంక్రాంతి పండుగకు భీమవరం వెళ్దామా? అక్కడ ‘కామన్’ వెల్త్ క్రీడలు బాగా జరుగుతాయి కదా? అని అడిగితె .. రవితేజ ఇటువంటివి ఫోన్ లో మాట్లాడకూడదు పర్సనల్ గా చెబుతా? అని సరదా అనడం పెద్దగా వైరల్ అవుతుంది. కోడి పందాలు ఉక్కు పాదంతో అణచివేస్తాం? జూదాలు అడకండి అని పోలీస్ శాఖ ఎప్పటిలానే తన వంతు కృషి చేస్తున్నప్పటికీ ఎక్కడెక్కడి నుండో ఆధునిక వాహనాలులో బడా బాబులు నుండి తెలుగు రాష్ట్రాలలో సామాన్యులు వరకు పండుగ సరదాలు అంటూ భీమవరం వైపు క్యూ కడుతున్నారు. అన్ని లార్జ్ లు విడిది గృహాలు ఈ నాలుగు రోజులు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేశాయి. అయితే జిల్లా కేంద్రంగా మారిన నేపథ్యంలో.. గతంలో లాగాపట్టణ పరిధిలో ప్రకృతి ఆశ్రమం పరిసరాలు, ఇండస్ట్రీ ఏరియా వంటి నోటిఫైడ్ పరిసరాలలో ఈసారి సంక్రాంతి సరదాలు కనపడకపోవచ్చు.. అన్ని భీమవరం పరిసర గ్రామాలకే పరిమితం చేస్తున్నారని భావిస్తున్నారు. శృంగవృక్షామ్ , వీరవాసరం పాలకొల్లు, యలమంచిలి, ఉండి పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున సంక్రాంతి సరదాలు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ నెల 10 తేదీ నుండి జిల్లాలో చాలాచోట్ల కబడ్డీ, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు మొదలయ్యాయి. నిజానికి బోగి రోజు నుండి అవే సెటింగ్స్ సంక్రాంతి సరదాలకు వేదికలుగా మారిపోతాయని స్థానికుల అభిప్రాయం. ఉండి పరిసరాలలో పందాలు కొడితే కారు, బుల్లెట్స్ గెలుచుకొనే అవకాశాలకు ఆఫర్స్ వినిపిస్తున్నాయి. లక్షలాది రూపాయలు పందాలు కాసే బరులవద్ద, గొడవలు జరగకుండా భారీ ఎత్తున బౌన్సర్ ల ను నిమించే స్థాయి ఒక్క భీమవరం పరిసరాలలోనే ఉంటుంది.
