సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం స్థానిక డి.యన్.ఆర్. కళాశాల గ్రౌండ్ లో ఘనంగా స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ – 2023 ను కళాశాల కార్యదర్శి, గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు) ప్రారంబించడం జరిగింది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. డి.యన్.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల లో నేటి శుక్రవారం నుండి మూడు రోజులు అనగా 17,18,19 తేదిలలో విద్యార్ధులకు స్పోర్ట్స్ & గేమ్స్ ను నిర్వహిస్తున్నామని విద్యార్ధులలో చదువులో పాటుగా ,వారి మానసిక ఒత్తిడులు దూరం చేసేలా, విద్యార్ధులలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించి, వారి ప్రతిభను గుర్తించి, వారికి కళాశాల తరుపున బహుమతులు ప్రధానం చేస్తున్నామని తెలిపారు. విద్యార్ధులు చదువుతో పాటు ఆరోఖ్యపరంగా ఇటువంటి ఆటలు ఆడడం ద్వారా ఆరోఖ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ Dr .యం. అంజాన్ కుమార్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. బి.వి.ఎస్.వర్మ కళాశాల పిజికల్ డైరెక్టర్, పి. నరసింహరాజు మరియు విద్యార్ధులు, ఉపాధ్యాయులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *