సిగ్మాతెలుగు డాట్, న్యూస్: భీమవరం బీవీ రాజు డిగ్రీ కళాశాలలోనేడు, శనివారం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ హైదరాబాద్ వారి నిర్వహించిన క్యాంపస్ ఉద్యోగ ఎంపికలో తమ కళాశాల విద్యార్థులు 13 మంది ఎంపికైయ్యారని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. 13 మంది బీఎస్సీ బయోలాజికల్ విద్యార్థులు ఎంపికైయ్యారని, వీరికి 2.7 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగ అవకాశాలు సాధించారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల ఛైర్మన్ కెవి విష్ణురాజు, వైస్ చైర్మన్ రవిచంద్రన్, సెక్రటరీ ఆదిత్య, డైరెక్టర్ జే ప్రసాద్ రాజు, దశిక సూర్యనారాయణ అధ్యాపకులు అభినందించారు.
