సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: RX 100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొన్న కార్తికేయ హీరోగా రూపొందిన బెదురులంక 2012 సినిమా ఈనెల 25న రిలీజ్ కానుంది. ఈ యూనిట్ పశ్చిమ గోదావరి జిల్లాలోనరసాపురం మొదలుకొని భీమవరం వరకు పలు ఇంజనీరింగ్ కాలేజీలలో కాలేజీ విద్యార్థులను కలుసుకొని సినిమా విశేషాలు వారితోపంచుకొని చిత్రంలోని పాటల్ని చూపించి డ్యాన్స్‌లు చేశారు.ఈ నేపథ్యంలో .. హీరో కార్తికేయ, నేహా శెట్టి,సినీ బృందం భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకొని బెదురులంక సినిమా విజయవంతం కోసం అమ్మవారి అస్సిసులు తీసుకొన్నారు.. ఆలయ సిబ్బంది ధర్మకర్తల మండలి సభ్యులు వారికీ మర్యాదపూర్వక దర్శనం చేయించి శ్రీ అమ్మవారి జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు.
