సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో గత శనివారం, నడిరోడ్డుపై తన భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. కేసు విచారం చేస్తున్న ఎస్సై సత్య సాయి తెలిపిన వివరాల ప్రకారం .. ఆకివీడుకు చెందిన మారడుగుల వీర వెవెంకట సత్యనారాయణ పెద్దకుమార్తె సాయి లక్ష్మీ కమల సంధ్య ను స్థానిక యువకుడు వి.రాంబాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 18 నెలలకుమారుడు కూడా ఉన్నాడు. కొద్దిరోజుల క్రితం రాంబాబు చైన్ స్నాచింగ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చా డు. అప్పటి నుంచి భార్యా భర్తల మధ్య గొడవలుతో సంధ్య పుట్టింటికి వెళ్లిపోయి.. భర్త తో విడాకుల కేసు పెట్టింది. ఈ నేపథ్యం లో గత శనివారం స్థానిక భీమేశ్వరస్వామి ఆలయానికి తండ్రి తో కలిసి వెళ్లింది. ఆలయం నుంచి బయటకు వచ్చి న సంధ్య ను అప్పటికే పొంచి ఉన్న రాంబాబు కసిగా పలుమారులు కత్తితో పొడవడంతో ఆమె అక్క డికక్క డే మృతి చెందిది. తండ్రి కేకలు వేస్తూ రక్తపు మడుగులో ఉన్న కుమార్తె వద్దకు వచ్చే సరికి రాంబాబు పారిపోయాడు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ శ్రీనాథ్ పరిశీలించారు. మృ తదేహాన్ని పోస్టుమార్టం కు తరలిచారు. సంధ్య హంతకుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట రెండు గంటలకు పైగా ధర్నా చేయడంతో వాహనాలుతో ట్రాఫిక్ నిలచిపోయింది. గత రాత్రి ఆకివీడు ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో సంధ్య ఆత్మ కు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *