సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలో సీఐడీ అధికారులు నేడు, ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రామకృష్ణ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మార్గదర్శి ఫై విచారణ ఒక ఎత్తు అయితే ఇటీవల గత 3 రోజులుగా మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్ జరిగిన తనిఖీల్లో కొత్తతరహాలో జరిగిన అవకతవకలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. మార్గదర్శి లో డిపాజిటర్లకు బదులు.. ఏజెంట్లు, మేనేజర్లు వేలం పాటలో పాల్గొంటున్నారు. బాధితుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ముందే అనేక పేపర్స్ ఫై సంతకాలు పెట్టించి తరువాత కొంతమందిని మోసం చేస్తున్నారు. షూరిటీ సంతకాలు పెట్టిన వారి ఆస్తులు అక్రమంగా లాక్కుంటున్నారు. అని ఆరోపించారు. సీఐడీ అదనపు డీజీ సంజయ్ మాట్లాడుతూ..మార్గదర్సి అక్రమాలపై 3 చోట్ల డిపాజిట్ దారులు ఫిర్యాదు చేశారని అన్నారు. మార్గదర్సి చిట్ ఫండ్ లో చేరకుండానే సుబ్రమణ్యం అనే వ్య క్తి ఆధార్ ఆధారంగా అతనికి తెలియకుండానే వేలం పాడారు. చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో 283/23 కేసుగా నమోదు చేశాం. అంటూ వీడియోను సైతం ప్రదర్శించారు. అనకాపల్లి పిఎస్ లో కూడా మరో ఫిర్యాదు దారుడు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. 4.60 లక్షలు చీటి డబ్బు కట్టగా కేవలం 20 రూపాయిలు మాత్రమే వెంకటేశ్వర రావుకి ఇచ్చి మోసం చేశారు. రాజమండ్రి టూ టౌన్ లో బాధితుడు కోరుకొండ విజయకుమార్ ఫిర్యాదు మేరకు మార్గదర్సి రాజమండ్రి బిఎం పై 179/23…409,420 సెక్షన్ లగా కేసు నమోదు చేశాం. ఈ మూడు కేసులలో బ్రాం చ్ మేనేజర్లని అరెస్ట్ చేశాం అన్నారు. ఇక సీఐడీ ఎస్పీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ..దేశ వ్యాప్తం గా సంచలనం కలిగించిన శారదా చిట్స్ లో తరహాలోనే మార్గదర్శి కుంభకోణం అని తెలిపారు. సుమారు 100 పిర్యాదులు అందాయి. ఇంకా ఎన్నో మోసాలు ఆధారాలతో సహా బయట పెట్టబోతున్నం.. చందాదారులకు తెలియకుండానే డబ్బు కాజేస్తున్నారు. మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లు ను రికార్డ్ చూపించమంటే కొందరు పారిపోయారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే వాట్సాప్ నెంబర్ 9493174065 ద్వారా ఫిర్యాదు చేయొచ్చ ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *