సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక 39 వ వార్డులో నేడు, సోమవారం జనసేన పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు & భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి గోవిందరావు మాట్లాడుతూ.. ముందుగా 39 వార్డు లో క్రియా శిలక మెంబర్ రావూరి పండు మృతి కి సంతాపం తెలుపుతున్నామని, రానున్న రోజుల్లో జనసేన పార్టీ చాలా బలంగా ముందుకు వెళ్తుందని అయన అన్నారు. ఈ 39 వ వార్డులో నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నపుడు ఇక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టి సుమారు ఇప్పటికి 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రజలకు నీరు అందివ్వలేకపోవడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అయన విమర్శించారు . ఈ జంబలకడి పంబ గాళ్ళు ఇంకెప్పుడు నీరు అందిస్తారో ?అని ఎద్దేవా చేసారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని ఆయన అన్నారు. అనంతరం సభ్యత కిట్లను క్రియాశీల మెంబర్లకు అందజేసి పార్టీలో కొత్తగా చేరిన సుమారు 40 మందికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీఏసీ మెంబర్ కనకరాజు సూరి, మళ్ళినీడి బాబి తదితర నేతలు , వీర మహిళలు,కార్యకర్తలు, పాల్గొన్నారు
