సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు నేడు, ఆదివారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మార్గదర్శిపై గతంలో రాష్ట్ర సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసు చార్జి షీట్లను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నో ఫర్దర్ యాక్షన్ అని ఉత్తర్వులు జారీ చేసింది. అయినా, న్యాయస్థానాల ఆదేశాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం రాక్షస మూకలాగా దాడులు చేస్తోంది.. ఏ తప్పు చేయని మార్గదర్శి సంస్థ ను శిక్షించాలా? అభయ హస్తం పథకం కింద ప్రజలు దాచుకున్న సొమ్మును దోచుకున్న ఈ ప్రభుత్వాన్ని శిక్షించాలా? అన్నది విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి. మార్గదర్శి సంస్థ యజమానులైన రామోజీరావు, శైలజా కిరణ్ ను అరెస్టు చేస్తే, సీతారామాంజనేయులు కు డీజీపీ గా పదోన్నతి కల్పిస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయిన మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అక్రమ దాడుల నుంచి సోమ, మంగళవారాలలో న్యాయస్థానాల నుండి ఆ సంస్థకు ఊరట లభించే అవకాశం ఉంది.అని ఆయన ఆశాభావము వ్యక్తం చేసారు. సి ఐ డి అధికారులకు శృంగ భంగం తప్పదని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
