సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం తణుకు నియోజకవర్గం లో జరుగుతున్న ‘జగన్ సేవాదళ్ ‘కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వైసిపి నేతలతో పాటు గౌరవ రీజనల్ కోఆర్డినేటర్లు మరియు ఎంపీలు మిథున్ రెడ్డి , పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రులు కొట్టు సత్యనారాయణ , కారుమూరి నాగేశ్వర రావు తో పాటు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా వేదికను పంచుకోవడం జరిగింది. ఈ సందర్భముగా ‘జగన్ సేవాదళ్ సభనుద్దేశించి గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మనమంతా సీఎం జగన్ చేస్తున్న ప్రజా సంక్షేమాన్ని ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి వెళ్లేలా కృషి చెయ్యాలని, తాను ఎక్కడ ఎమ్మెల్యేగా భావించనని, మీతో పాటు వైసిపి కి విధేయుడైన కార్యకర్తగానే పని చేస్తానని, ప్రతి నేత ఇదే తీరున అశేష జగన్ సేవాదళ్ క్యాడర్ తో కల్సి పనిచేస్తే వచ్చే ఎన్నికలలో గతం కన్నా మెరుగైన ఫలితాలు వస్తాయని, ఇక టీడీపీ, జనసేన పార్టీల కుమ్మక్క రాజకీయాలు కుట్రలు కు ప్రజలు సమాధి కడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు జగన్ సేవాదళ్ అధ్యక్షులు మరియు సభ్యులు పాల్గొన్నారు.
