సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజా సమాచారం ప్రకారం అమెరికన్ డాలర్ తో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి వరుసగా మూడో రోజూ (ఆగస్ట్ 24న ) లాభాల్లో కొనసాగుతోంది. డాలర్ మారకంలో రూపాయి మూడు వారాల గరిష్ఠ స్థాయిని 82.47 వద్ద మునుపటి ముగింపుతో పోలిస్తే 0.26 శాతం పెరిగింది. గత బుధవారం 27 పైసలు పెరిగి 82.72 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో, కరెన్సీ గరిష్టం గా 82.46ను తాకింది. చైనీస్ యువాన్ , జపనీస్ యెన్లలో పెరుగుదల , దేశీయ ఫండమెంటల్స్ సానుకూలంగా ఉండటం, రూపాయికి సానుకూలంగా మారింది. ఐపీవో సం బం ధ పెట్టుబడుల ప్రవాహం, దేశీ మార్కెట్లు సానుకూలంగా ఉండటం , క్రూడాయిల్ రేట్లు తగ్గుతుండటం తదితర అంశాలుతో అతి త్వరలో రూపాయి విలువ 82 స్థాయికి చేరవచ్చని అంచనాలు ఉన్నాయి.
