సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం మండలంలోని పలు గ్రామాలలో నేడు శనివారం పల్లె పండగ 3.0 లో భాగంగా ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పలు శంకుస్థాపనలు, పలు ప్రారంభోత్సవాలు చేశారు. నేలపోగుల గ్రామంలో జేఎస్ బి రోడ్డుకు శంకుస్థాపన, మడుగు పోలవరం గ్రామంలో సీసీ రోడ్డు, ఏపీఅర్ఆర్ ఎస్పీ గ్రాంట్ తో బీటీ రోడ్డుకు శంకుస్థాపన, కొణితివాడ గ్రామంలో సీసీ రోడ్లు శంకుస్థాపన, పల్లె పండుగ 2.0లో మంజూరైన నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు, జీఎస్ బి రోడ్డు ప్రారంభోత్సవం, ఉత్తర పాలెంలో సిసి రోడ్డుకు శంకుస్థాపన, పల్లె పండుగ 2.0లో మంజూరైన నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం, నౌడూరు గ్రామంలో పల్లె పండుగ 2.0 లో మంజూరైన నిధులతో నిర్మించిన జిఎస్ బి రోడ్డు ప్రారంభోత్సవం, అండలూరు గ్రామంలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన, తోలేరు గ్రామంలో పల్లె పండుగ 2.0 లో మంజూరైన నిధులతో నిర్మించిన జిఎస్ బి రోడ్డును ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమమాలలో మాజీ మంత్రి పీతల సుజాత తో పాటు స్థానిక కూటమి నేతలు గ్రామస్తులు పాల్గొన్నారు.
