సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తమ సమస్యల పరిష్కారం కోసం వేలాది మంది విజయవాడలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనలో జరిగిన ఘటనలపై చంద్రబాబు సర్కార్ కఠిన వైఖరి అవలంభిస్తుంది. ఆందోళనలలో కీలకంగా వ్యవహరించిన 46 మంది నేతలను గుర్తించి వారి వివరాలతో ప్రభుత్వానికి నివేదికను అందించినట్లు సమాచారం.వారికీ షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో 46 మంది ఉద్యోగుల జాబితాను జిల్లా కలెక్టర్లకు ఉన్నతాధికారులు పంపించారు. వచ్చే సోమవారం సాయంత్రంలోపు ఆయా ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు పంపించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ఒకరిద్దరిపై అధికారులు సస్పెండ్ చేసినట్లు మరోవైపు ఈ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం విజయవాడ పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు వార్త కధనాలు వస్తున్నాయి.
