సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆసియా గేమ్స్‌లో భాగంగా ఈసారి క్రికెట్ కూడా ఉండటంతో భారత్ ఖాతాలో నేడు, శనివారం 20 వ గోల్డ్ మెడల్ చేరింది. సిల్వర్ మెడల్స్ , కాంస్య మెడల్స్ కలపి ఇప్పటికే భారత్ ఖాతాలో 85 కి పైగా పతకాలు సాధించి ఆసియా క్రీడలలో 5 వ స్థానంలో చేరింది. తాజగా జరిగిన పురుషుల క్రికెట్లో భారత్ విజయం సాధించింది. అది కూడా తన దయాది శత్రు దేశం పాకిస్తాన్ ఫై... టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ తడబడింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగులకే పరిమితమైంది. దీంతో 19 పరుగుల తేడాతో టీమ్ఇండియా గెలుపొంది.. మరోసారి పసిడి పతకాన్ని ముద్దాడింది.ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా. అభిషేక్ శర్మ 61 (28 బంతుల్లో; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), తిలక్ వర్మ 51* (22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగడంతో ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది. అహ్మద్ డేనియల్, అరాఫత్ మిన్హాస్ తలో 2 వికెట్లు తీయగా.. సైమ్ ఆయుబ్, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ తీశారు..నిన్న(శుక్రవారం) ఆరు స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి. అదే ఊపు లో నేటి శనివారం, ఉదయం క్రికెట్ పురుషుల విభాగంలో టీమిండియా పసిడి పతకం, తాజాగా మరో స్వర్ణం భారత్ రెజ్లింగ్‌లో గెలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *