సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ప్రపంచ ప్రజలు దేశాధినేతలు రియల్ హీరో అని కొనియాడుతున్న భారతీయ సూపర్ హీరో పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌ తాను హనుమాన్ భక్తుడనని, ఆ స్వామిదయా తో ఆ ఘటనలో తనతో పాటు 180 మంది ని రక్షించుకోగలిగామని పేర్కొన్నారు. విషయంలోకి వెలికితే.. దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌ వెళుతున్న విమానం కూల్చేసేందుకు ప్రయత్నించిన కో-పైలట్‌ తనను అడ్డుకున్న పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌పై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘర్షణలో సుమారు 10 కత్తి పోట్లతో తీవ్రంగా గాయపడిన మచ్చార్‌ ప్రస్తుతం అబుధాబిలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ప్రధాని మోదీ ఆయనకు వీడియోకాల్‌ చేయగా.. ఆస్పత్రి బెడ్‌పై నుంచే విమానంలో జరిగిన ఘటనను మోదీకి వివరించారు. ఆ ఘటనపై ప్రధాని మోడీతో మాట్లాడటం గర్వంగా భవిస్తున్నానని, ఆ దుర్ఘటనలో తన ప్రాణాల కోసం పోరాడుతూనే, ఇతరులను కూడా చావనివ్వకూడదని నిర్ణయించుకున్నానని.. తన ఇష్టదైవం హనుమాన్‌ చాలీసా పఠించి ధైర్యం తెచ్చుకున్నానని తాను కష్టాల్లో ఉన్నప్పుడల్లా హనుమాన్‌ చాలీసా పఠిస్తానని, దేశానికి దూరంగా ఉన్నా సంస్కృతికి దగ్గరగా ఉన్నానని చెప్పారు. మోదీకి చెప్పారు. తన శరీరంలో శక్తినంతటినీ కూడదీసుకుని విమానాన్ని, ప్రయాణికులను కాపాడేందుకు తన వంతు ప్రయత్నించానని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *