సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల యువ హీరోల రేసులో బాగా వెనుకబడిన వరుణ్ తేజ్. “ఆపరేషన్ వాలెంటైన్’తో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు వరుణ్ తేజ్ హీరోగా ఈ సినిమాను ప్రఖ్యాత సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్,రినైసన్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మించాయి. మానుషి చిల్లర్ కథానాయిక. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో మార్చి 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో గత ఆదివారం రాత్రి జరిగిన వేడుకలో చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ..‘‘కాశ్మిర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది పైగా సీఆర్పీ ఎఫ్ జవాన్లు వీర మరణం పొందారు. ఆ దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళి అర్పించేలా.. దానికి కారణమైన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు మన భారత వైమానిక దళం చేసిన సాహసోపేతమైన యుద్ధమే ఈ సినిమా.. ఇది యోధుల యదార్ధ గాధ తో నిర్మించిన సినిమా , మా వరుణ్ తేజ్ హీరోగా గర్వపడే సినిమా.. ఇలాంటి చిత్రాలు గొప్పగా ఆడాలి, భారత జవాన్లు మనకు స్ఫూర్తి అలాంటి రియల్ హీరోలకు ఇలాంటి చిత్రాలు చూసి ఓ సెల్యూట్ చేయాలి. అన్నారు. నాగేంద్ర బాబు కూడా మాట్లాడారు..
