సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజాగా అందిన సమాచారం ప్రకారం.. భీమవరంలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు కు పవన్ కళ్యాణ్ ను స్వయంగా కలవమని పిలుపు వచ్చింది. ఆయన పవన్ తో భేటీకి సిద్ధం అవుతున్నారు. ఆయన సమక్షంలో జనసేన లో చేరతారని, ఆర్ధికంగా బలమైన నేతగా ఆయనకు ఆయనకు జిల్లాలో 3సీట్లలో పవన్ తో సహా జనసేన అభ్యర్థుల గెలుపు పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తారని ప్రాధమిక సమాచారం. అయితే ఈ పిలుపు తో ఎన్నో ఊహాగానాలకు తెరలేచింది. ఒక వేళా తన సీటు అంజిబాబు కు ఇస్తారా?ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యా ణ్ భీమవరం నుండి పోటీ చేస్తున్నట్లు తనకు సహకరించాలని స్థానిక టీడీపీ, బీజేపీ కీలక నేతల ఇండ్ల తో పాటు మాజీ టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ఇంటికి కూడా వెళ్లి ఆయన సహకారం కోరారు. అయితే అంజిబాబు ముందు2009 కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అయిన 2014 టీడీపీ లో ఎమ్మెల్యే అయిన తరువాత 2019 లో పరాజయం పొందిన కూడా ఒక విభిన్నమైన రాజకీయ శైలి లో వ్యవహరిస్తుంటారు. ఆయన గత 4న్నర ఏళ్ళు పైగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. టీడీపీ లో కీలక నేతలు ఆయనను వ్యతిరేకిస్తున్న, మీటింగులకు పిలవకపోయిన అంజిబాబు మాత్రం ఇటీవల పలుమారులు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తాను బరిలో దిగుతానని ధీమా ప్రకటించారు.ఆయన జనసేన లో ఒక కీలక వర్గానికి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఎంపీ రఘురామా ఇటీవల భీమవరం వచ్చినపుడు ఆయన ఇంట్లో భేటీ అయ్యారు. ఇటీవల పవన్ స్వయంగా తన ఇంటికి వచ్చిన నేపథ్యంలో పవన్ పోటీ చేస్తే మద్దతు ఇస్తానని అయితే ఒకవేళ నాకు టికెట్ ఇస్తే భీమవరం నుండి పోటీ చేస్తానని పవన్ కె చెప్పినట్లు ప్రకటించారు. మరి అంతా సిద్ధం చేసుకొన్నా పవన్ వేరే నియోజకవర్గానికి ( తాడేపల్లి గూడెం ?) కు మారతారా ? ఆలా అయితే స్థానిక వైసిపి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు భయపడి నియోజక వర్గం మారారు అన్న విమర్శలు తట్టుకోవాలి.. అసలు ఈ ఊహాగానాలు ఎంత మేర నిజం అవుతాయో? మరో 2 రోజులులో తేలుతుంది అని సమాచారం. గత 2019 ఎన్నికల్లో వీరికి పాలయిన ఓట్లు పరిశీలిస్తే.. పవన్ కు భీమవరంలో 62,285 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన పులపర్తి అంజిబాబు కు 54,037 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్ది గ్రంధి శ్రీనివాస్ కు 70,642 ఓట్లు రాగా.. ఆయన 8,357 ఓట్లతో విజయం సాధించారు.
