సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇకపై దేశవ్యాప్తంగా అన్ని స్కూల్స్ లోను పిల్లలకు ఆరేళ్లు నిండితేనే ఒకటవ తరగతిలో అడ్మి షన్ ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం తాజగా పంపిన లేఖలలో ఆదేశాలు ఇచ్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ) 2020, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 కింద ఒకటవ తరగతిలో చేరే పిల్లలకు ఆరేళ్ల వయస్సు తప్పనిసరని సూచించింది. వచ్చే కొత్త విద్యా సంవత్సరం నుంచే ఇది అమలు చేయాలని కోరింది. దీనితో తక్కువ వయస్సులోనే పిల్లల ను ఆటపాటల బాల్యానికి దూరం చేసి స్కూల్ లో చేర్పించి ఉద్దరించాలనుకొనే తల్లి తండ్రులకు ఇది కొంత ఇబ్బందికరమే ..
