సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే మంతెన రామరాజు ను మరోసారి అధిష్టానం ప్రకటించడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు నేడు, మంగళవారం భీమవరంలోని తన కార్యాలయంలో మీడియాతో సన్నిహితులతో.. టీడీపీ పార్టీ కోసం 2 దశాబ్దాలుగా కష్టపడి పనిచేసి, వ్యాపారాలు వదులుకొని ఎన్నో రకాలుగా నష్టపోతే ..ఇప్పుడు కనీసం తనను సంప్రదించకుండా అభ్యర్థిని ఎన్నిక చేసారని చాల బాధగా ఉందని మాట్లాడుతుండగా .. అకస్మాత్తుగా టీడీపీ ఎమ్మెల్యే రామరాజు వచ్చి తనకు టికెట్ వచ్చినందున గతంలో లాగా సహకరించాలని కల్వపూడి శివ ను కోరడంతో ఆయన ఇక చాలు.. నేను కూడా పోటీ చేస్తాను.. అనటం జరిగింది. గతంలో ఉన్న సన్నిహితంతో MLA రామరాజు కల్వపూడి ప్రక్కన కూర్చుని మాట్లాడడానికి ప్రయత్నించగా టక్కున కల్వపూడి శివ లేచి నిలబడటంతో రామరాజు ఇక చేసేది లేక ఆయన నిలబడి పోయారు. వెంటనే శివ కూర్చుండి పోయిన ఘటన అక్కడ చూస్తున్న వారికీ ఎంత మిత్రుడైన, సన్నిహితుడైన తనను మోసం చేసాడని భావన పెరిగితే రాజకీయాలలో ఇంతటి తిరస్కారం ఉంటుందా? అనిపించింది. తనకు ఉన్న జనబలం వచ్చే ఎన్నికలలో పోటీ చేసి చూపిస్తానని తన కార్యాచరణ మరో 2 రోజులలో ప్రకటిస్తానని శివ మీడియాతో ప్రకటించారు. అక్కడే బయటకు వస్తున్నా, ఎమ్మెల్యే రామరాజు తో కొందరు మీడియా మిత్రులు ఇంటర్యూ చెయ్యడానికి ప్రయత్నించగా శివరామరాజు ఇది నా ఆఫీస్ ఏమైనా ఉంటె బయట చేసుకోండి అని వారించడం గమనార్హం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *