సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నవోదయ విద్యాలయ సమితి 1,377 నాన్ టీచింగ్ పోస్టుల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. NVS రిక్రూట్‌మెంట్ లో డ్రైవ్ స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (HQ/RQ కేడర్), మెస్ హెల్పర్, ల్యాబ్ అటెండెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్ లాంటి మొత్తం 1,377 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే ఏ అభ్యర్థి అయిన అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.in ని విజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను పూరించి దాన్ని సబ్మిట్ చేయాలి. అభ్యర్థులు ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు రుసుమును చెల్లించవచ్చు. మే 2న కరెక్షన్‌ విండో ఓపెన్‌ అవుతుంది. అధికారిక షెడ్యూల్ ప్రకారం మే 2,3,4 వరకు మూడు రోజుల పాటు NVS దరఖాస్తు ఫారమ్‌కు కరెక్షన్‌ విండోను ఓపెన్ చేస్తారు. ఎన్‌వీఎస్‌(NVS) అడ్మిట్ కార్డ్, పరీక్ష తేదీని ఎన్‌టీఏ తన అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో ప్రకటిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *