సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న భీమవరం చిన అమిరం కి చెందిన కే వెంకట సుబ్బరాజు శ్రీదేవి దంపతులు శ్రీ అమ్మవారికి 1,11,116/ రూ .. అక్షరాలా .. ఒక లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు కానుకగా అందజేశారు. వీరికి ఆలయ అర్చకులు కొప్పేశ్వరరావు పూజలు నిర్వహించి ప్రసాదం శేషవస్త్రం ఫోటో అందజేశారని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బుద్ధా మహాలక్షి నగేష్ తెలిపారు.
