సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత మంగళవారం రాత్రి భీమవరం లోని శాసన మండలి చైర్మన్ వారి క్యాంప్ కార్యాలయంలో మండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు ఆధ్వర్యంలో స్థానిక ముస్లిం మైనార్టీ సంఘాల వారితో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెద్ద మసీదు ప్రసిడెంట్, మాజీ కౌన్సిలర్ షేక్ రబ్బానీ, వక్ఫ్ బోర్డు సభ్యులు, అబ్దుల్ హై తదితర ముస్లిం నాయకులు పాల్గొన్నారు. ముస్లిం సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. అలాగే మొన్న సోమవారం .రాత్రి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం దళిత, దళిత క్రైస్తవుల ఆత్మీయ సమావేశం శాసనమండలి చైర్మన్ గారి క్యాంప్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి అడ్వకేట్ బోకూరు విజయరాజు గారు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజు , క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షులు మేడిది జాన్సన్ , ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న గారు మాజీ కౌన్సిలర్ శ్రీ పాలపర్తి జోనా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో ఉన్న దళిత దళిత క్రైస్తవ ముఖ్యమైన నాయకులందరూ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *