సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం గురు పౌర్ణమి, ఆషాడ పౌర్ణమి నేపథ్యంలో భీమవరం పట్టణంలో పంచా రామ క్షేత్రం, శ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయాలతో పాటు అన్ని సాయి బాబా దేవాలయాలలో ప్రత్యక పూజలు అభిషేకాలు, అన్నసమారాధనలు నిర్వహిస్తున్నారు. భీమవరం శివారు లోని పెదమిరం లో స్వర్ణ సాయి మందిరంలో భారీ స్థాయిలో గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. నేటి ఉదయం 7గంటల నుండి 11న్నర్ర సమయం వరకు వేల మంది సాయి భక్తులు హాజరు అయ్యి క్యూ లైన్లలో నిలబడి బాబా వారికీ స్వయంగా పంచ ద్రవ్యాలతో, ఆవుపాలచే భక్తులచే సాయి విగ్రహానికి అభిషేకాలు నిర్వహించారు. ప్రతి ఏడాది లానే దాతల సహకారంతో భక్తులకు ఉచితంగా ఈ అభిషేకం ఏర్పాటు చేసారు. నేటి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు వేలాది భక్తులకు పంచభక్ష్య అన్న సమారాధన కొనసాగుతూనే ఉంది. నేటి మధ్యాహ్నం హారతి అలంకారం నుండి శ్రీ స్వర్ణ సాయి బాబా వారికీ ‘బంగారు కిరీటం’ అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు, ఇక్కడికి 7 కిమీ దూరంలో ఉన్న సీసలి గ్రామంలోని శ్రీ షిరిడి సాయి దేవాలయంలో కూడా ఇదే రీతిన వేలాది భక్తుల కోలాహలం నడుమ గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.మారుతి సెంటర్ బాబావారి మందిరంలోను మినీ షిరిడీలోను ,జేపీ రోడ్డు లోని గురుదత్త అష్టలక్ష్మి ఆలయంలో, శ్రీరామపురంలోని శ్రీ సత్యసాయి సేవ ట్రస్ట్ మందిరంలో , ఉండి రోడ్డు లోని హనుమత్ ఖాళీ ప్రసాద్ మందిరం లోను, గునుపూడి పంచా రామం వద్ద శ్రీ సాయి ఆలయం, హోసింగ్ బోర్టు లోని బాబావారి ఆలయంలో వైభవంగా వేడుకలు అన్న సమారాధనలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *