సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 10 రోజులుగా భానుడి ప్రతాపం తో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలు నేడు, మంగళవారం మధ్యాహ్నం 3గంటల నుండి ఒక్కసారిగా కారు మబ్బులతో చల్లగాలులు విస్తు పెళ్లున కురిసిన వర్షంతో సేద తీరారు. వర్షం ధారలాగ ఆలా సాయంత్రం 6 గంటల వరకు పడుతూనే ఉంది. పట్టణంలో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పిడుగులు,ఉరుములతో పట్టణంలో పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలచిపోయింది. రోడ్లు, డ్రెయిన్లు ఏకమయ్యాయి. భారీ వర్షం కారణంగా జాతీయ రహదారిపై నీరు నిలిచిపోయింది. హౌసింగ్‌బోర్డు కాలనీ, చిన్నరంగనిపాలెం, 7వ వార్డు, మెంటేవారితోట ప్రాంతం, పాత శ్రీనివాసా థియేటర్ రహదారి, గునుపూడి, నాచువారి సెంటర్ , బ్యాంకు కాలనీతో పాటు పరిసర ప్రాంతాలు, టూ టౌన్ శ్రీరాంపురం ప్రాంతం, బలుసుమూడి దుర్గాపురం, లంకపేటప్రాంతాల్లో వీధులన్నీ నీట మునిగాయి. కొన్ని ప్రాంతాలలో అడుగు లోటు నీరు నిలిచింది. మొత్తానికి ప్రజలకు చిన్నారులకు ఉపశమనం లభించింది.
