సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిని గూడూరి ఉమాబాల, రాజ్యసభ సభ్యులు, మోపిదేవి వెంకటరమణ , భీమవరం నియోజకవర్గం YCPఎమ్మెల్యే అభ్యర్థి, గ్రంధి శ్రీనివాస్ తో గత సోమవారం రాత్రి వీరవాసరం మండలం నవుడూరు గ్రామంలో జయహో బిసి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను 99% అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందని, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కి మనమందరం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గూడూరి ఉమాబాలా మాట్లాడుతూ .. నరసాపురం పార్లమెంటు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక బీసీ మహిళనైన నాకు అవకాశం కల్పించి చరిత్ర తిరగరాసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కి అందరు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ , డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య , సంచార జాతుల చైర్మన్ పెండ్ర వీరన్న , భీమవరం జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహరావు , జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గొలగాని సత్యనారాయణ , కామన నాగేశ్వరరావు గారు, కోడె యుగంధర్ ,, తిరుమాని ఏడుకొండలు, కోటిపల్లి బాబు, వీరవల్లి శ్రీనివాస్, తదితర బీసీ సంఘాల నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు విశేషంగా పాల్గొన్నారు.
