సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా నేడు, సోమవారం ఉదయం భీమవరంలో శ్రీ అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు పలువురు ప్రముఖులు. పలు సాంసృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ నేపథ్యంలో జనసేన, బీజేపీ బలపరిచిన ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణ రాజు ఉండి ఎమ్మెల్యే , తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, జనసేన నేతలు కూడా అల్లూరికి ఘన నివాళ్లు అర్పించారు. తదుపరి ఆకివీడు నగర పంచాయితీలో కూటమి పార్టీల బీసీ నేతల సమక్షంలో జరిగిన “జయహో బీసీ” కార్యక్రమంలో పాల్గొని బిసిలకు కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాగానే వచ్చే ప్రయోజనాలు, వారి రక్షణ కోసం చేస్తున్న చట్టం గురించి వివరించారు. 50 ఏళ్లకే బిసిలకు పింఛను ఇవ్వనున్నామని , బీసీ లకు సమ నాయ్యం చేస్తామని గతంలో వలె బిసి లు కూటమి కి అండగా ఉండాలని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *