సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ లకు జరుగుతున్నా ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ఈ నెల 13వ తేదీన పోలింగ్‌ జరుగనుండడంతో రేపటి శనివారం తో ప్రచార పర్వము ముగియనుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు కు కూడావచ్చే ఓట్లపై బెట్టింగ్ రాయుళ్లు పందాలు కు సిద్ధం అయ్యారు.రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ స్థానాలకు, ఎమ్మెల్యే స్థానాలకు ప్రధానంగా ఇటు పిఠాపురం, కుప్పం, భీమవరం, ఉండి నియోజకవర్గాలకు సంబంధించి , గోదావరి జిల్లాల్లో మొత్తం సీట్లలో గెలుపు ఓటముల గురించి పందాలు ప్రోత్సహిస్తున్నారు. అయితే, భీమవరంతో పాటు జిల్లా లో ఫేక్ సర్వే ల ప్రచారం తీవ్రంగా ఉంది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరి సర్వే లు వారు చేయించుకొంటునప్పటికీ నిజానికి ఓటర్లు తెలివిగా లాభ నష్టాలు లెక్కలు వేసుకొంటూ గుంభనంగా ఉన్నారు. ఎవరు ఏ పార్టీ సర్వే చేస్తున్నారో గ్రహించి వారి అభ్యర్థి గెలుస్తాడని చెబుతున్నారు. ఎవరికి వారు భారీ మెజారిటీ అంటూ లెక్కలు వేసుకొంటున్నారు. ఈ నేపథ్యంలో తప్పుడు సలహాలతో ముఖ్యంగా సామాన్యులు ఈ బెట్టింగులకు పోకూడదని మనవి. ఈసారి రాబోతున్న తీర్పు .. సమాజంలో అన్ని వర్గాలు కలసి చెప్పే ఏకపక్ష తీర్పు కాదు.. ఒకో వర్గం ఒకో పార్టీకి అంకితమై పనిచేస్తున్నారు. ఫైనల్ గా మహిళలు ఇచ్చే తీర్పు ఎక్కువ ప్రభావం చూపుతుంది. 100 శాతం కచ్చితమైన సర్వే ఎవరు ఇవ్వలేరు. అందువల్ల అందరు రాజకీయ పార్టీల ఉద్రిక్తతలకు, గొప్పకు పోకుండా బెట్టింగులకు దూరంగా ఉంటె మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *