సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీలో ఎన్నికలు అయిన తర్వాతి రోజు మెగా సోదరుడు నాగబాబు సోషల్ మీడియాలో ఓ వ్యాఖ్య చేశారు. “మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేేసవాడు మావాడు అయినా పరాయివాడే, మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే’’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్‌ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిజానికి అల్లు అర్జున్ ను ఉద్దేశించి నాగబాబు అలా స్పందించారని సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. దీనంతటికి కారణం అల్లు అర్జున్ , తన స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిశోర్‌ రెడ్డికి మద్దతు తెలుపడానికి నంధ్యాలకు వెళ్లడమే కారణం. అదే రోజు చంద్రబాబు అక్కడ బహిరంగ సభకు వస్తే.. పరోక్షంగా తెలుసో తెలియకో నంద్యాల లోనే అల్లు అర్జున్ మిత్రునికి మద్దతుగా పర్యటించారు. మెగా అభిమానులంతా బన్నీ చేసింది తప్పని ‘మేనమామ కోసం పిఠాపురం వెళ్లలేని బన్నీ పిలవని పేరంటానికి నంధ్యాల వెళ్లాడంటూ సోషల్‌ మీడియాలో ఒక రేంజ్‌ లో ఆడుకొన్నారు . దానితో గత రెండు రోజులుగా అల్లు అర్జున్ ఆర్మీ రూపంలో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు కొణిదెల నాగబాబుపై సోషల్‌మీడియాలో విపరీతంగా దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. అయితే ఈ వివాదం ముదరడంతో నాగబాబు తాను బన్నీ నుద్దేశించి అనలేదని పేర్కొన్నప్పటికీ వారి ట్రోల్స్ దాడి ఆగకపోయడంతో తాజాగా తన ట్విట్టర్‌ అకౌంట్‌ డియాక్టివేట్‌ చేశారు. మాటల యుద్ధం ముదరకుండా, వివాదాన్ని పెద్దది చేయకుండా ఉండటం కోసం నాగబాబు ట్విట్టర్‌ ఖాతాను తొలగించారని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *