సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అసలే ఇజ్రాయిల్, హమాస్, ఇరాన్ ల మధ్య దాడులు ప్రతిదాడులతోఆందోళన కలిగిస్తున్న పశ్చిమ ఆసియా దేశాల సంక్షభంలో తాజగా హెలికాఫ్టర్ ప్రమాదం లో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ గల్లంతు మరింత ఆందోళన రేకేతించే అంశంగా మారింది. గత రాత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రాధమిక సమాచారం ప్రకారం వాతావరణ పరిస్థితులే హెలికాఫ్టర్ ప్రమాదానికి కారణం అని భావిస్తున్నారు. అజర్‌బైజాన్ సరిహద్దుల్లో ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. తాజాగా హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని ‘ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ’ (IRCS) గుర్తించినట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తాసంస్థ ఐఆర్ఎన్‌ఏ ప్రకటించింది. ఈ ఘటన జరిగిన 12 గంటల తర్వాత హెలికాప్టర్ శకలాల్ని రెస్క్యూ టీమ్స్ కనిపెట్టాయి. ‘తావిల్’ అనే ప్రాంతంలో అధ్యక్షుడి హెలికాప్టర్ కూలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే అక్కడ ఎవరూ బతికి ఉన్న ఆనవాళ్లు కనిపించడం లేదని అధికారులు పేర్కొన్నట్టు ఆ కథనం పేర్కొంది.ఈ పరిస్థితులలో అధ్యక్షుడు చనిపోయినట్లు అధికారిక ప్రకటన చేసింది ఇరాన్
