సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో పోలింగ్ రోజు మొదలుకొని రాష్ట్రంలోని గుంటూరు, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించడం నిందితులు పరారీ లో ఉన్నపటికీ పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అలర్ట్‌ అయ్యారు. జిల్లా ఎస్పీ అజిత వేజేండ్ల ఆదేశాలతో జిల్లాలో ఉన్న అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో పోలీస్‌ అధికారులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నారు.( ఫై చిత్రంలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ ల చెకింగ్ లో ఎస్పీ అజిత ..) భీమవరం, టీపీ గూడెం, తణుకు వంటి పట్టణాలలో ఎవరైనా కొత్తవారు ఉంటే వారికోసం దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుల వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో భీమవరం తో సహా ప్రధాన పట్టణాలలో వాహనం ఉంటేనే పెట్రోల్ పోయాలని , బాటిళ్ళలో పెట్రోల్‌ పోయరాదంటూ పెట్రోల్‌ బంక్‌ల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల అనంతరం విష్ణు కళాశాలలో ఆచంట, పాలకొల్లు, నరసాపురం తణుకు నియోజకవర్గాల ఈవీఎం లు భద్రపరచగా , ఎస్‌ఆర్‌కెఆర్‌ కళాశాలల్లో భీమవరం, ఉండి తాడేపల్లి గూడెం లకు చెందిన ఈవీఎంలు భద్రపరచడంతో అక్కడ ప్రతిష్ఠమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బలగాలతో బందోబస్తు ను భీమవరం డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి మరియు ఇతర పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *