సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని పవిత్ర పంచారామ క్షేత్రం గునుపూడి లో వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానంలో నిత్యం భక్తులకు జరిగే అన్న సమారాధన నిర్వహిస్తున్న నిత్య అన్నదానం ట్రస్టు నకు స్వర్గీయ సాగి అచ్యుత రామరాజు జ్ఞాపకార్థం కుమారుడు సాగి విఠల్ రంగరాజు రూ,1,00,000/-లు శాశ్వత అన్నదానం నిమిత్తం కానుకగా సమర్పించారని దేవాలయ కార్యనిర్వహణాధికారి, డి రామకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం నందు శ్రీ వర్థినీడి వెంకటేశ్వర రావు, తనిఖీదారు, దేవదాయ శాఖ, భీమవరం వారు పాల్గొయున్నారు
