సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇరాన్ కు 2 నెలలు పాటు చమురు అమ్ముకోవడానికి అమెరికా అనుమతులు ఇవ్వడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మరింత దిగి వస్తున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా తగ్గి 76.29 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గత మంగళవారం భారీగా నష్టపోయిన ఐటీ సెక్టార్ నేడు,బుధవారం తిరిగి పుంజుకోవడం జరిగింది. గత సెషన్ (76,200)తో పోల్చుకుంటే నేడు,బుధవారం ఉదయం లాభాలతో మొదలైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు కొనసాగించింది. మధ్యాహ్నం తర్వాత ఆ లాభాలు మరింత పెరిగాయి. చివరకు సెన్సెక్స్ 790 పాయింట్ల లాభంతో 76,991 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా 197 పాయింట్ల లాభంతో 24,021 వద్ద ముగించింది.(stock market) బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 966 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 64 పాయింట్లు ఆర్జించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.66గా ఉంది.
