సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ కృష్ణ లంక పోలీస్ స్టేషన్ లో నిందితులు అనుమానితులపై జరిగే తీవ్ర అరాచకాలు సైకో ట్రీట్మెంట్స్ ఫై మీడియాలో వెలువడుతున్న వరుస కధనాలు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్నాయి. మరో ప్రక్క గాదె సాయి కృష్ణ ను పోలీసులే చంపివేశారని ఆరోపణలు నిజం అని ఆధారాలు సిట్ నిర్ధారించింది.. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక నిందితుడు సీఐ నాగరాజుకు ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తికావడంతో 2వ ఏజేఎస్ కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. ఈ సందర్భంగా కోర్టుకు సిట్.. రిమాండ్ రిపోర్టును సమర్పించింది. రిమాండ్ రిపోర్టులో సాయికృష్ణది కస్టోడియల్ డెత్ అని, డెడ్‌బాడీని డెస్ట్రాయ్ చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది.. అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నా అరెస్ట్ చేసాక కోర్టులో హాజరుపర్చలేదని సిట్ వెల్లడించింది.. మే 5 నుంచి జూన్ 19 మధ్య కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టాం. 17 మంది సాక్షులను విచారణ చేశాం. ఫోరెన్సిక్ బృందం సాయంతో సీసీటీవీ కెమెరా ఫీడ్ స్వాధీనం చేసుకున్నాం. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో హిమజ అనే స్టేషన్ సిబ్బందిని విచారించాం. కృష్ణలంక పోలీస్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ డేటా సిస్టమ్‌లో లేదు. సాయికృష్ణ మృతదేహాన్ని పోలీస్ స్టేషన్లోనే చూసినట్లు… మే5 నుంచి మే8 మధ్య సాయికృష్ణని కృష్ణలంక పీఎస్‌లో చూసినట్డు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారు’ అని రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ పేర్కొంది.సాయికృష్ణ మరణించాడని తెలిసినా కూడా కృష్ణలంక పోలీస్ సిబ్బంది ఆ సమాచారం మేజిస్ట్రేట్‌కు చేరవేయలేదు. సాయికృష్ణ మరణించాడని అతని తల్లి స్టేషన్‌కు వెళితే సీఐ నాగరాజు దూషించాడు. హైకోర్టులో సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినా కోర్ట్ ముందు వాస్తవాలను తెలపలేదు... ఈ పరిణామాలన్నీ గమనించాక సైంటిఫిక్ ఎవిడెన్స్ చెరిపివేయడం ద్వారా సాయికృష్ణను హత్య చేశాడని గుర్తించాం. జూన్ 2 కంటే ముందే సాయికృష్ణ మరణించాడని మేము విశ్వస్తున్నాం. కస్టడీలో ఉండగా గాయాలపాలై మరణించాడని అన్ని ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయి’ అంటూ రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ ప్రకటించింది..మరి ఎవరి ప్రోద్భలంతో సి ఐ నాగరాజు సాయి కృష్ణ ను టార్చెర్ చేసి చంపాడో విచారణలో తెలవలసి ఉంది.
‘
