సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పోతులూరి వీరబ్రహ్మము గారు చెప్పినట్లు పలు వింతలు కాలక్రమం న జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏకంగా వేపచెట్టుకు మామిడి పండ్లు కాయడం జరిగింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. అందుకు సంబంధించిన వీడియోను చెట్టు యజమాని, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సోషల్ మీడియా వేదికగా ఇటివల ప్రదర్శించారు. అయన ఇటివల భోపాల్‍లోని తన నివాసాన్ని సందర్శించడానికి వచ్చారు. ఆయన బంగ్లా నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. బీ7 బంగ్లాలో పెద్ద సంఖ్యలో చెట్లు, మొక్కలు ఉన్నాయి. ఆ క్రమంలో పనులు పరిశీలిస్తుండగా ఆయన కళ్లు అక్కడ పెరుగుతున్న వేప చెట్టుపై పడ్డాయి. దూరం నుంచి చూస్తే వేప చెట్టులా కనిపించింది. కానీ దగ్గరకు వెళ్లి చూసేసరికి దానికి కొన్ని చోట్ల చక్కగా మామిడి ఆకులతో పాటు మామిడికాయలు కాశాయి. దీంతో షాకైన మంత్రి చెట్టు వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విషయం తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున ఆ చెట్టు వద్దకు చేరుకుని వీక్షిస్తున్నారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
