సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు బుధవారం (జూన్ 12) దేశీయ స్టాక్ మార్కెట్ లో సూచీలు స్వల్ప లాభాలతో మొదలై క్రమంగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో మొదటి గంటలోనే నిఫ్టీ 23,419 పాయింట్ల వద్ద సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 50(Nifty) తాజా జీవితకాల గరిష్ట స్థాయిని స్కేల్ చేయడంతో దేశీయ స్టాక్‌లు మంచి పెరుగుదలను చూశాయి. దీంతోపాటు ఉదయం 11 గంటల సమయంలో బ్యాంక్ నిఫ్టీ 478 పాయింట్లు పెరుగగా, సెన్సెక్స్ 557 పాయింట్లు ఎగబాకింది. దీంతోపాటు నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ కూడా 504 పాయింట్లు లాభపడింది.బ్యాంకులు, ఫైనాన్షియల్, ఐటీ, మెటల్ షేర్లు లాభపడటం ఈ భారీ పెరుగుదలకు సపోర్ట్ ఇచ్చాయి. ఈ క్రమంలోనే బీఎస్ఈ(BSE) సెన్సెక్స్(Sensex) 500 పాయింట్లకు పైగా ఎగబాకి 76,968 వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో దేశీయ మార్కెట్ల పెరుగుదలతో దాదాపు కొన్ని నిమిషాల వ్యవధిలోనే మదుపర్లు రూ. 2.8 లక్షల కోట్లను సంపాదించారు.ఈ నేపథ్యంలో సెన్సెక్స్(Sensex)లో టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, పవర్‌గ్రిడ్ టాప్ గెయినర్లుగా ఉండగా, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల స్టాక్స్ టాప్ నష్టాల్లో ఉన్నాయి.
