సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం భీమవరం లో ఎస్ ఐ నాగేశ్వర రావు గుండెపోటు తో మరణించడం పోలీస్ వర్గాలతో తీవ్ర విషాదాన్ని నింపింది. గత 5 నెలలు క్రితం రాష్ట్రంలో ఎన్నికల బదిలీల లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న ఏ. నాగేశ్వరరావు ను భీమవరం బదిలీ చేశారు. ఎన్నికలు కాగానే మూడునెలల్లోనే యదావిధిగా పాత స్థానాలకు వేస్తారని, స్వంత ప్రాంతానికి వెళ్లిపోవచ్చునని ఎంతో ఆశగా ఆయన ఎదురు చూశాడు. ఐదు నెలలు గడిచాయి అయినా వీరిని పట్టించుకున్న వారు లేరు. ఒక పక్క రిటైర్మెంట్ దగ్గర పడుతుంది. ఈఆలోచనలతో నిత్యం సతమతమవుతూ తన బాదను దిగమింగుకుని ఉద్యోగం చేస్తున్నాడు. రాత్రి నైట్ రౌండ్స్ వెళ్లి ఇంటికి చేరుకున్నాడు.తెల్లవారిన తరువాత కూడా భర్త ఇంటికి రాకపోవడాన్ని గమనించిన భార్య ఉదయాన్నే తన తోటి ఉద్యోగులకు ఫోన్ చేసి సార్ ఎక్కడ ఉన్నారు ఇంకా ఇంటికి రాలేదు అని అడగగా.., మేడం సార్ నాలుగు గంటలకే ఇంటికి వెళ్లిపోయారు అని అని సిబ్బంది తెలిపారు . అన్ని చోట్లా వెతకగా తను ఉంటున్న ఆయన నివాసం ఉంటున్న స్థానిక అపార్ట్మెంట్ లోని సెల్లార్ లో ఉన్న కారులో చనిపోయి ఉండడాన్ని గమనించారు .కొద్ది రోజుల్లో రిటైర్మెంట్ అయ్యి తమ కుటుంబంతో ఆనందంగా గడిపి ఎన్నో బెనిఫిట్స్ పొందవలసిన ఎస్సై ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబం లో తీవ్ర విషాదం నిండిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *