సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వాయుగుండా ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసాయి. భీమవరం , ఏలూరు లలో గత రాత్రి నుండి నేటి శనివారం సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. భీమవరం మధ్యాహ్నం కూడా పూర్తీ మేఘాలు వర్షపు ముసురుతో అంధకారం అలముకొంది. లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిఉంది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పాలపాడు వద్ద వరద బీభత్సం సృష్టించింది. ఉప్పలపాడు-గోళ్లమూడిపాడు మధ్య కాలువలో ఓ కారు కొట్టుకుపోయి అందులో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీవీఐటీ-వీవా స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు టీచర్ రాఘవ, ఇద్దరు విద్యార్థులుగా అధికారులు గుర్తించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్లో మిల్క్ ప్రాజెక్ట్ దగ్గర సయ్యద్ అప్పలస్వామి కాలేజీ వెనుక చెట్టు కూలిపోయి అక్కడే ఉన్న ఆటో, కారుపై పడడంతో ఆటో, కార్ డ్యామేజ్ అయ్యాయికృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక వద్ద కృష్ణానది వరద ప్రవాహం కొనసాగుతోంది.
