సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి తెలుగు దేశం పార్టీ అడ్జక్షుడు.. రాజకీయులకు అతీతంగా అజాతశత్రువు గా పేరొందిన, ఉండి మాజీ ఎమెల్య మంతెన రామరాజు నేడు, శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా (ఏపీఐఐసీ) పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంతెన మాట్లాడుతూ.. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి ‘‘నన్ను నమ్మి ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కి, మంత్రి లోకేష్ బాబుకు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, కూటమి పెద్దలకు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు’’ అని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఏపీఐఐసీ ద్వారా కియా, హీరో ఇలా ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తుచేశారు. గత 2019-2024 మధ్య వచ్చిన ప్రభుత్వం ఏపీఐఐసీని నిరుపయోగం చేశారని ఆరోపించారు. ఇకపై నా హయాంలో పారిశ్రామికవేత్తలందరికీ ఏపీఐఐసీని అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు.ముఖ్యంగా ఎన్డీఏ కూటమి 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందని.దానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు.
