సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హర్యానాలో ఓట్ల లెక్కింపు క్షణం క్షణం ఉత్కంఠ రేపుతోంది. అనేక ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పినట్లు ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి పట్టం కట్టలేదు. విజయానికి ఆమడ దూరంలో ఉంచి బీజేపీ ని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తేవడం కి కావలసిన ( ప్రస్తుతం 11-50 కు ఓట్ల లెక్కింపు ఫలితాలు ఆధారంగా) మెజారిటీ స్థానాలలో బీజేపీ అభ్యర్థులు ముందజంలో ఉన్నారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు అధికారం కోసం 46 సీట్లు అవసరం కాగా.. ప్రస్తుత సరళి చూస్తుంటే బీజేపీ కి 49 స్థానాలలో ఆధిక్యతలో ఉంది.. బీజేపీ, కాంగ్రెస్ నువ్వా, నేనా అన్నట్లు పోటీ పడుతోంది. మొదట కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చగా.. ఆ తర్వాత వెనుకబడింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ఆధిక్యాన్ని చూపించింది. దీంతో ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు స్పష్టమవుతోంది.కాంగ్రెస్ 36 సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. బీఎస్పీ, ఐఎన్‌ఎల్‌డి కూటమి కేవలం రెండు సీట్లలో, ఇతరులు 3సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *